Tirumala : బ్రహ్మోత్సవాల ఆదాయం ఏడు కొండలవాడికి ఎంతో తెలుసా?

Tirumala : బ్రహ్మోత్సవాల ఆదాయం ఏడు కొండలవాడికి ఎంతో తెలుసా?

Update: 2025-10-03 07:52 GMT

బ్రహ్మోత్సవాలకు ఆరు లక్షల మంది భక్తులు హాజరయ్యారని తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీఆర్‌ నాయుడు తెలిపారు. అక్టోబర్‌ 1వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఆరుగురు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని చెప్పారు. కేవలం ఎనిమిది రోజుల్లో 5.8 లక్షల మంది భక్తుల దర్శనం చేసుకున్నారని తెలిపారు.

ఆరు లక్షల మంది...
అన్నమయ్య భవన్‌లో విలేఖరుల సమావేశంలో టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడారు. ఈ ఎనిమిది రోజుల్లో హుండీలో భక్తులు .25.12 కోట్ల రూపాయలు కానుకలుగా వచ్చాయని తెలిపారు. భక్తులు సమర్పించిన ఈ కానుకలను హుండీ ద్వారా టిటిడి స్వీకరించిందని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.


Tags:    

Similar News