Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. అదే జరిగితే?

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు

Update: 2025-07-30 08:08 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో రద్దీ పెరుగుతుండటంతో వసతి గృహాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో భక్తులు వసతి గదులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులున్నారు.

శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు...
ఇందులో భాగంగా శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలిసింది. ఏ రోజుకు ఆ రోజే టిక్కెట్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. సాయంత్రం సమయానికి మారిస్తే వసతి గదులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్న టీటీడీ అధికారులు ప్రస్తుత విధానం వల్ల శ్రీవాణి భక్తులు రెండు రోజుల పాటు వసతి గదులు పొందుతున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంటుంది.


Tags:    

Similar News