తిరుమలకు వచ్చే భక్తులకు అలెర్ట్.. ఆలయ ద్వారాలు మూసివేత

తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం ఇచ్చింది

Update: 2026-01-05 12:28 GMT

తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం ఇచ్చింది. మార్చి 3వతేదీన తిరుమలకు వచ్చేభక్తులకు స్వామి వారి దర్శనాలు కష్టమవుతుంది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన తిరుమలలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

చంద్రగ్రహణం సందర్భంగా...
ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల పాటు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.47కు పూర్తవుతుండగా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.మార్చి 3వ తేదీన శ్రీవారి ఆర్జిత సేవల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.


Tags:    

Similar News