ఇక వారికి ప్రత్యేక దర్శనం.. ఏప్రిల్ 1 నుంచి

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2022-03-29 03:44 GMT

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. కరోనా కారణంగా వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను టీడీపీ రెండేళ్ల క్రితం నిలిపివేసింది. అయితే ఇప్పుడు దీనిని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది.

రోజుకు వెయ్యి మంది..
ఏప్రిల్ ఒకటో తేది నుంచి రోజుకు వెయ్యి మంది చొప్పున వికలాంగులు, వృద్ధులకు టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించనుంది. మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక దర్శనాలు కల్పించనున్నారు. అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆర్జిత సేవల్లో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని కూడా టీటీడీ అధికారులు పరిశీలిస్తున్నారు.


Tags:    

Similar News