ఎల్లుండి ఆన్ లైన్ లో ఆర్జిత సేవల టిక్కెట్లు

ఆర్జిత సేవల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 20 వ తేదీన విడుదల చేయనుంది

Update: 2022-03-18 02:27 GMT

ఆర్జిత సేవల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 20 వ తేదీన విడుదల చేయనుంది. ఆన్ లైన్ లో ఈ టిక్కెట్లు ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయి. మార్చి 20వ తేదీ నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకూ ఈ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ పేర్కొంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మరాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.

కోవిడ్ వ్యాక్సినేషన్....
టిక్కెట్లు ఆన్ లైన్ లో పూర్తయిన తర్వాత రెండు రోజల్లో వాటి ధరను భక్తులు చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను నేరుగా బుక్ చేసుకునే వీలుంది. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కాని, రెండో డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కాని విధిగా తీసుకు రావాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.


Tags:    

Similar News