Tirumala : తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్... ఆంక్షలివే.. ఆ సేవలు రద్దు
తిరుమలలో రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. సేవలను రద్దు చేసింది
తిరుమలలో రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీన జరిగే రథ సప్తమి రోజున తిరుమలకు రెండు నుంచి మూడులక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నారు. వాహన సేవలను వీక్షించడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చే్స్తున్నారు. రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీన పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసింది. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసింది.