Tirumala : నేడు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
నేడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పన్నెండు గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు.
నేడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పన్నెండు గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు. పదిహేను గంటల పాటు భక్తులకు తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతించరు. నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం రాక తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమలలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు.
గ్రహణం వీడిన తర్వాత...
అనంతరం చంద్రగ్రహణం రాత్రి వీడిన తర్వాత 3.30 గంటలకు తెరవనున్నారు. అయితే ఆలయ సంప్రోక్షణ తర్వాత మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతిస్తారు. శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులను మాత్రం రేపు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అనుమతిస్తారు. రేపు తిరుమలలో వీఐపీ సిఫార్సు లేఖలను కూడా అనుమతించమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 9వ తేదీ నుంచి యధాతధంగా అన్ని లేఖలను అనుమతించనున్నారు.