Tirumala : పరకామణి కేసులో సీఐడీ విచారణ ప్రారంభం
తిరుమలలో పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ జరుపుతోంది.
తిరుమలలో పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ జరుపుతోంది. హైకోర్టు అదేశాలతో పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సీఐడీ బృందం సీఐడీ డీజీ రవిశంకర్ నేతృత్వంలో విచారణ ప్రారంభమయింది. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించిన సీఐడీ బృందం, పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్ పీఎస్‌లో రికార్డుల పరిశీలించింది.
లోక్ అదాలత్ లో...
2023 మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది. 920 డాలర్లు చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడిన సంగతి తెలిసిందే.చోరీ ఘటనలో టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో న్యాయస్థానం సీరియస్ అయింది. లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలు వచ్చాయి. లోక్‌అదాలత్‌లో రాజీ తర్వాత 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీటీడీకి రవికుమార్ విరాళంగా ఇచ్చారు. తాజాగా హైకోర్టు అదేశాలతో పరకామణి కేసు విచారణ సీఐడీ మొదలుపెట్టింది.