Tirumala : నిర్మానుష్యంగా మారిన అలిపిరి
తిరుమలలో. ఎప్పుడూ భక్తుల రద్దీ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి వద్ద వాహనాల తనిఖీ వద్ద అతి పెద్ద క్యూ లైన్ నిత్యం ఉంటుంది
తిరుమలకు నిత్యం భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడూ భక్తుల రద్దీ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి వద్ద వాహనాల తనిఖీ వద్ద అతి పెద్ద క్యూ లైన్ నిత్యం ఉంటుంది. బారులు తీరిన వాహనాలను అలిపిరి వద్ద చూసి తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉంటుందో అంచనా వేయవచ్చు. అలిపిరి వద్ద వాహనాలను, సామాగ్రిని తనిఖీలు చేస్తుంటారు.
చంద్రగ్రహణంతో...
అయితే ఈరోజు తిరుపతిలోని అలిపిరి వద్ద ఎవరూ లేరు. నిర్మానుష్యంగా కనిపించింది. చంద్రగ్రహణం ఎఫెక్ట్ అలిపిరి వద్దనే కనిపించింది. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని దాదాపు పదహారు గంటల పాటు మూసివేస్తుండటంతో భక్తులు ఎవరూ రాలేదు. దీంతో అలిపిరి వద్ద వాహనాలు లేక వెలవెలబోతూ కనిపించింది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు, భక్తులు లేకపోవడంతో ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ కూడా పెద్దగా లేదు.