తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Update: 2025-06-23 04:55 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.28 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది.

ప్రఖ్యాత ఆటో మొబైల్ కంపెనీ, అశోక్ లేలాండ్ టీటీడీకి ఒక 41-సీటర్ ఏసి బస్సును ఆదివారం నాడు విరాళంగా అందించింది. సుమారు రూ. 35 లక్షల విలువైన ఈ బస్సును అశోక్ లేలాండ్ M&HCV అధ్యక్షుడు సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు టీటీడీకి అందజేశారు. ప్రతి ఏడాది అశోక్ లేలాండ్ కంపెనీ టీటీడీకి ఒక ఆటోమొబైల్ వాహనాన్ని విరాళంగా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, తిరుమల డిపో డిఐ వెంకటాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News