కొత్త జిల్లాల ఏర్పాటు.. అభ్యంతరాలు లెక్కకు మించి

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సమయం దగ్గరపడుతుంది. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

Update: 2022-03-22 02:24 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సమయం దగ్గరపడుతుంది. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి ప్రభుత్వం అభ్యంతరాలను కోరింది. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన మీదట కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది.

11 వేల అభ్యంతరాలు....
అయితే ఇప్పటి వరకూ కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్గ్ర వ్యాప్తంగా 11 వేల అభ్యంతరాలు ప్రభుత్వానికి అందాయి. కొన్ని లోక్ సభ స్థానాల పరిధిలో ఉన్న ప్రాంతాలు జిల్లా కేంద్రాలు మారాయి. ఉదాహరణకు ప్రకాశంల జిల్లా కేంద్రమైన ఒంగోలుకు అద్దంకి కేవలం ముప్ఫయి కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇరవై నిమిషాల్లో జిల్లా కేంద్రానికి చేరుకునే వీలుంది. కానీ అద్దంకిని బాపట్ల జిల్లాలో కలిపేశారు. నరసరావుపేట, కృష్ణా, అమలాపురం జిల్లాలకు సంబంధించి పేర్ల విషయాల్లోనూ అభ్యంతరాలు వచ్చాయి.


Tags:    

Similar News