గన్నవరంలో మూడు విమానాలను అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్ లో మంచు కురుస్తుండటంతో మూడు విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు
Rajkot airports
హైదరాబాద్ లో మంచు కురుస్తుండటంతో మూడు విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో దాదాపు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానాలను వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
150 మంది ప్రయాణికులు...
చత్తీస్‌గడ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులందరూ భయాందోళనలకు గురయ్యారు. వీరు తాము హైదరాబాద్ కు వెళ్లాల్సి రావడంతో గన్నవరంలోనే వెయిట్ చేస్తున్నారు.