Andhra Pradesh : ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఓకే

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Update: 2025-11-25 11:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రంప చోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు అనకాపల్లి జిల్లాలో నక్క పల్లి రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ేర్పాటయ్యే మదనపల్లె జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ లు...
కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లాలో బనగానపల్లె రెవెన్యూ డివిజన్, సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంాన్ని విభజించిపెద్ద హరితవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు.


Tags:    

Similar News