Srisailam : శ్రీశైలం వెళ్లే వారు అలెర్ట్ గా ఉండాల్సిందే.. 15 కి.మీలు ట్రాఫిక్ జామ్

శ్రీశైలం వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి. శనివారం, ఆదివారం కావడంతో భారీగా భక్తుల సంఖ్య పెరిగింది

Update: 2025-07-13 02:41 GMT

శ్రీశైలం వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి. శనివారం, ఆదివారం కావడంతో భారీగా భక్తుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అయితే పర్యాటకులు ఎక్కువ కావడంతో దోమలప పెంట చెక్ పోస్టు నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ ఉన్న పాతళ గంగ వరకూ వాహనాలు నిలిచిపోయాయి. పది కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోకపోతే...
దాదాపు ఈ రోజు 15 కిలోమీటర్లు ట్రాఫిక్ జాం అయింది. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ప్రజలు ఇబ్బందులు పడతారు. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ లేదా డీజిల్, కల్వకుర్తి లో నే పట్టించుకోవడం మంచిది. శ్రీశైలం లో కేవలం రెండు పెట్రోలు బంకులు మాత్రమే ఉన్నాయి. హై డిమాండ్ లాంగ్ క్యూ ఉంటుంది. . ఫుడ్ కోసం ముందే జాగ్రత్త లు తీసుకోవడం అవసరం. ఫ్రూట్స్, బిస్కట్లు, చపాతి, పూరి మరియు వాటర్ బాటిల్స్ ను కారులో ఉంచుకోవడం మర్చిపోకండి. లేకుంటే ఇబ్బందుల పడగతారు.


Tags:    

Similar News