ముద్రగడ ఇంటి వద్ద యువకుడు .. ట్రాక్టర్ తో ఢీకొట్టి?

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి వద్ద ఒక ట్రాక్టర్ తో ఇంటి గేటును ఢీకొట్టారు

Update: 2025-02-02 05:40 GMT

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి వద్ద ఒక ట్రాక్టర్ తో ఇంటి గేటును ఢీకొట్టారు. పార్కింగ్ లో ఉన్న ఆయన కారును ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. అయితే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ ఇంటివద్ద యువకులు హల్ చల్ చేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు...
ఆ సమయంలో కిర్లంపూడిలోని తన ఇంట్లోనే ముద్రగడ పద్మనాభం ఉన్నారు. ఆయన అనుచరులు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఎందుకోసం ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటిలోకి ప్రవేశించాల్సి వచ్చిందో అడిగి తెలుసుకుంటున్నారు. విషయం తెలిసిన ముద్రగడ అనుచరులు కిర్లంపూడికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.


Tags:    

Similar News