ఏపీలో అలుముకున్న పొగమంచు

ఈ రోజు మార్నింగ్ సమయం లో పొగమంచు ఎక్కువగా ఉంది

Update: 2026-01-07 03:10 GMT

ఈ రోజు మార్నింగ్ సమయం లో పొగమంచు ఎక్కువగా ఉంది. కృష్ణా, గుంటూరు,బాపట్ల, ప్రకాశం, పల్నాడు విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప ఈ జిల్లా లోపొగ మంచు అలుముకుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకూ పొగమంచు వీడకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు.

అల్పపీడనం...
బంగాళాఖాతం లో అల్పపీడనం వాయుగుండం గా మారుతుంది. ఇది శ్రీలంక -తమిళనాడు వైపు వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నై, తమిళనాడు, శ్రీలంక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు వైపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షలు, కొన్ని చోట భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.


Tags:    

Similar News