గీతం యూనివర్సిటీ వద్ద టెన్షన్
విశాఖపట్నం గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారు జామునుంచి యూనివర్సిటీలో ఆక్రమణలు తొలగిస్తున్నారు
విశాఖపట్నం గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారు జామునుంచి గీతం యూనివర్సిటీలో ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఎండాడ, రుషికొండ మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించడం లేదు. కిలోమీటర్ దూరంలోనే రాకపోకలను నిలిపేశారు. రెవెన్యూ అధికారులు, 200 మంది పోలీసులు గీతం యూనివర్సిటీ ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆక్రమణల తొలగింపుతో...
జేసీబీ, డ్రిల్లింగ్ మిషన్లతో వచ్చిన సిబ్బందిని గీతం యూనివర్సిటీ సిబ్బంది అడ్డుకుంటుున్నారు. డెంటల్ కళాశాల ఎదురుగా ఫెన్సింగ్ పాతి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. గీతం యూనివర్సిటీకి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఎవరినీ అనుమతించకపోవడంతో ఈరోజు కళాశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వంద మందికి పైగా కార్మికులను కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు.