Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... నేడు నేరుగా దర్శనం.. ఆలయ మహాద్వారం వరకూ ఖాళీ క్యూ లైన్

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది

Update: 2025-09-24 03:39 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో మధ్యాహ్నం నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. దసరా సెలవులు కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో మధ్యాహ్నం నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

రోజుకు ఇరవై ఐదు వేల టోకెన్లు...
నేటి నుంచి శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా గరుడ వాహన సేవరోజు సర్వదర్శనం టోకెన్లు కూడా రద్దు చేస్తున్నారు. ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో కేవలం ఇరవై ఐదు వేల టోకెన్లు మాత్రమే సర్వదర్శనానికి విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఇక ముందుగా ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
కంపార్లమెంట్లన్నీ ఖాళీ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. స్వామి వారిని కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు నేరుగా దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగా పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,837 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,904 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.85 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారుల వెల్లడించారు.


Tags:    

Similar News