పిఠాపురంలో నీటి ఎద్దడి.. పవన్ కు మహిళల వినతి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది.

Update: 2025-05-05 05:31 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. అనేక ప్రాంతాల్లోతాగు నీటి కోసం అల్లాడి పోతున్నారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో మహిళలు మంచినీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉప్పాడ గ్రామంలో...
మంచినీరు సరఫరా కావడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వీధి కుళాయిల్లోనూ మంచి నీరు రావడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. జలజీవన్ మిషన్ అమలు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ తమ దాహార్తి తీర్చెదవరంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కల్యాణ్ తమకు తాగునీటి ఎద్దడిని తొలగించి ఆదుకోవాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఉప్పాడ మహిళలు కోరుతున్నారు.


Tags:    

Similar News