Tirumala : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు అంతే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. తిరుమలకు గత పదిహేను రోజుల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ సమయంలో తిరుమలకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. గంటల కొద్దీ స్వామి వారి దర్శనం కోసం వేచి చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోతున్నాయి. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నా, వృద్ధులు, చిన్నారులు వేరే మార్గం నుంచి వెళ్లాలని సూచిస్తున్నారు.
గంటకు 4,500 మంది...
తిరుమలలో నారాయణగిరి షెడ్లలోనే గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తుంది. సాయంత్రానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు దాటి శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింంది. గంటకు నాలుగు వేల ఐదు వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి కైంకర్య సేవల సమయం పోను పద్దెనిమిది గంటల పాటు దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ అంటే పద్దెనిమిది గంటల పాటు భక్తులు ఏడు కొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కంపార్ట్ మెంట్లు నిండి...
తిరుమలలో అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు కంపార్ట్ మెంట్లు దాటి.. శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 95,080 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.