Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. చంద్రగ్రహణం తర్వాత ఆలయ తలుపులు తెరుచుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. చంద్రగ్రహణం తర్వాత ఆలయ తలుపులు తెరుచుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. నిన్న చంద్రగ్రహణం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఈరోజు చంద్రగ్రహణం తర్వాత సంప్రోక్షణ అనంతరం ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తులను ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుండటంతో భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి చూస్తున్నారు. చంద్రగ్రహణం తర్వాత స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని భావించి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
సెప్టంబరు రెండో వారంలోనూ...
నిన్నటి వరకూ కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. సెప్టంబరు రెండో వారంలోనూ తిరుమలకు భక్తుల రద్దీ తగ్గడం లేదు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో హుండీ ఆదాయం కూడా భారీగా తిరుమల శ్రీవారికి సమకూరుతుంది. అయితే ఇక రానున్నది దసరా సెలవుల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతుంది.
పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 27,410 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 9,656 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.