Pawan Kalyan : పవన్ కల్యాణ్ పొలిటికల్ పాపులారిటీ తగ్గిందా? పెరిగిందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికలకు ముందు ఉన్న పొలిటికల్ పాపులరిటీ ఇప్పుడు ఉందా? లేదా? అన్న చర్చజరుగుతుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికలకు ముందు ఉన్న పొలిటికల్ పాపులరిటీ ఇప్పుడు ఉందా? లేదా? అన్న చర్చజరుగుతుంది. విపక్షాలు సయితం పవన్ కల్యాణ్ ను అంత తేలిగ్గా విమర్శించడానికి ముందుకు రావడం లేదు. అందుకు ఒకే ఒక ప్రధానకారణం.. పవన్ కల్యాణ్ వెంట లక్షలాది మంది అభిమానులు ఉండటం ఒక కారణమయితే .. మరొకవైపు ప్రధానమైన, అధికారంలోకి రావడానికి ఎక్కువ స్థానాలు గెలిచి పాలన పగ్గాలు చేపట్టడానికి నెలవైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలే కారణం. పవన్ కల్యాణ్ కు గత ఎన్నికల్లో కేవలం అభిమానులు మాత్రమే కాకుండా కాపు సామాజికవర్గం కూడా వెనక నిలబడింది. తమ నేత అధికారంలోకి వస్తారని భావించి అందరూ ఒక్కటయి పవన్ కు సపోర్టు చేశారు.
ఈ రెండు జిల్లాల్లో...
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది గడిచిన తర్వాత పవన్ కల్యాణ్ కు తాము చొక్కాలు చించుకుని మద్దతిచ్చినా తమ వైపు చూడటం లేదన్న బాధ కాపు సామాజికవర్గంలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చినందు వల్ల తమకు ప్రత్యేకంగా జరిగిన ఉపయోగం లేదని, తమ ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ పవన్ కల్యాణ్ సరిగా వ్యవహరించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమకు న్యాయపరంగా దక్కాల్సిన పథకాలు కూడా అందడం లేదని వారు వాపోతూ కామెంట్స్ పెడుతున్నారు.
పథకాలు.. పదవులు...
అధికారానికి రావడానికి తామే ప్రధాన కారణమని తెలిసినా పవన్ కల్యాణ్ మాత్రం దానిని పట్టించుకోకుండా కేవలం ఉప ముఖ్యమంత్రి గానే ఉంటూ కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగానే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వారిలో ఏర్పడిందంటున్నారు. తమకు అవసరమైన సాయం చేయలేనప్పుడు మనోడు అనుకోవడం కూడా వృధాయేనని బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. కనీసం రాజకీయ పదవులు కావచ్చు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కావచ్చు. తమను దూరం పెట్టినా కూడా పవన్ ప్రశ్నించడం లేదని అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ సన్నిహితులు మాత్రం లబ్దిదారుల అర్హత ఉన్నవారందరికీ కులాలు, మతాలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని, ఇందులో ప్రత్యేకించి సిఫార్సు చేయడం ఉండదని అంటున్నారు. మొత్తం మీద ఏడాది తర్వాత పవన్ పాపులారిటీపై కాపు సామాజికరవర్గంలో చర్చ జరుగుతోంది.