ఏజెన్సీలో కొనసాగుతున్న డోలి మోత కష్టాలు

అల్లూరి ఏజెన్సీలో తప్పని డోలి మోత కష్టాలు తప్పడం లేదు.

Update: 2025-04-29 04:22 GMT

అల్లూరి ఏజెన్సీలో తప్పని డోలి మోత కష్టాలు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలలో రహదారులను నిర్మించామని చెబుతున్నప్పటికీ ఆ ప్రాంత గిరిజనులు ఇంకా డోలీని ఆశ్రయిస్తున్నారు. గాయపడిన వారు, గర్భవతులు, ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాలంటే డోలీ యే శరణ్యమయింది.

అల్లూరి జిల్లాలో...
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషం తాగి రవన్నబాబు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. రోడ్డు సౌకర్యం లేక రెండు కిలోమీటర్లు డోలి మోసిన స్థానికులు. జాములవీధి నుంచి జి.మాడుగుల ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఇప్పటికైనా తమ ప్రాంతానికి రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి తమను కాపాడాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.


Tags:    

Similar News