నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ

నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలులో దొంగతనాలు జరగడం కలకలం రేపింది.

Update: 2025-05-02 04:16 GMT

ఇటీవల రైళ్లలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. మొన్న గోదావరి ఎక్స్ ప్రెస్ లో చోరీ జరగగా, నిన్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ జరిగింది. తాజాగా నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలులో దొంగతనాలు జరగడం కలకలం రేపింది. కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్య గురువారం తెల్లవారు జామున ఆగి ఉన్న రైలులోకి దొంగలు ప్రవేశించారు. ఎస్3, ఎస్ 4 బోగీల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్శ్రీవెంకటేశ్వరపాలెం స్టేషన్ సమీపంలో ఆగిన సమయంలో ఎస్ 3లో నిద్రిస్తున్న వారి నుంచి మూడు తులాల బంగారాన్ని అపహరించారు.

రైలు ఆగి ఉన్న సమయంలో...
హైదరాబాద్ కు చెందిన మౌనిక మెడలో బంగారు ఆభరణాన్ని దోచుకెళ్లారు. ఎస్ 4 బోగీలోనూ హైదరాబాద్ కు చెందిన ధనలక్ష్మికి చెందిన మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే మంగళసూత్రం మాత్రం ఈ పెనుగులాటలో కనిపించకుండ పోయింది. దీంతో బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రై్ల్వే పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News