సినిమా టికెట్ల ధరలపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

టికెట్ ధరలపై డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. టికెట్ల ధరల నియంత్రణపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 35 రద్దు అన్ని

Update: 2021-12-20 09:27 GMT

సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 35ను సస్పెండ్ చేస్తూ గతవారం హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి వెళ్లింది. ఈ పిటిషన్ పై డివిజన్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టికెట్ ధరలపై డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. టికెట్ల ధరల నియంత్రణపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 35 రద్దు అన్ని థియేటర్లకూ వర్తిస్తుందని అడిషినల్ జనరల్ వ్యాఖ్యానించారు.

గురువారానికి వాయిదా
గత విచారణలో పిటిషనర్లకే జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తెలిపిన విషయం విధితమే. ధరల పెంపుపై ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్లకు పంపాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్ సూచించింది. వివరాలను అడిషనల్‌ అఫిడవిట్‌లో దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల నియంత్రణపై ఏర్పాటైన కమిటీ వివరాలు తెలిపేందుకు హైకోర్టు గడువిచ్చింది. ఇక తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.


Tags:    

Similar News