గన్నవరం ఎయిర్ పోర్టు...గాలిలోనే విమానాలు
దట్టమైన పొగమంచు విమాన రాకపోకలకు అంతరాయం కల్గిస్తుంది. విమానం ల్యాండింగ్ సమస్య తలెత్తుతోంది
bullets at rajahmundry airport
దట్టమైన పొగమంచు విమాన రాకపోకలకు అంతరాయం కల్గిస్తుంది. విమానం ల్యాండింగ్ సమస్య తలెత్తుతోంది. గన్నవరం ఎయిర్ పోర్టులో పలు విమానాలు ల్యాండ్ కాలేక గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. గన్నవరం ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉండటంతో పైలెట్లకు రన్ వే కన్పించక గాలిలోనే విమానాలను ఉంచారు.
గంట నుంచి...
ఢిల్లీ, బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న విమానాలు దాదాపు గంట సేపు నుంచి గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. ప్రయాణికులు విమానాలు గాల్లోనే ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.