గ్రహణం తర్వాత తెరుచుకున్న ఆలయాలు

చంద్రగ్రహణం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి.

Update: 2025-09-08 02:33 GMT

చంద్రగ్రహణం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. సంప్రోక్షణ అనంతరం ఆలయాల్లో దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.సుప్రభాతసేవతో తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. ఉదయం 9:30 నుంచి ద్వారకా తిరుమల ఆలయంలో దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8:30 నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంటలకు తెరుచుకున్న శ్రీశైలం మల్లన్న ఆలయంలోకి భక్తులను దర్శానినికి అనుమతిస్తున్నారు.

తెలంగాణలోని...
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ తర్వాత ఆలయ దర్శనానికి అనుతిస్తారు. కొండగట్టు అంజన్న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు.భద్రాచలం రామాలయంలో దర్శనాలకు అనుమతి ఇచ్చారు. వరంగల్ లోని వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, రామప్ప, కాళేశ్వరం, పాలకుర్తి సోమేశ్వరాలయంలో సంప్రోక్షణ తర్వాత ఉదయం 7 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇచ్చారు. వేములవాడ ఆలయంలో భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి.


Tags:    

Similar News