జగన్ కు ధైర్యం లేకనే...?

జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు

Update: 2022-06-03 04:19 GMT

others

జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదన్న నిబంధననను టెండర్ లో పెట్టడం సిగ్గు చేటని ఆయన తెలిపారు. ప్రభుత్వ చర్యలు రాష్ట్ర పరువు తీసేలా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. బిల్లుల కోసం కోర్టులకు వెళ్లవద్దని టెండర్లలో నిబందధనలను పెట్టడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము చేసిన పనులకు సంబంధించి బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదన్న నిబంధన బహుశా ఏ రాష్ట్రంలో లేదన్నారు.

ఆ హక్కును హరించే....
న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కును ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని చంద్రబాబు అన్నారు. అసలు ఈ నిబంధన పెట్టడానికి ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్న ఆయన ఈ నిబంధన నిర్మాణ, వ్యాపార, సేవల రంగంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాల్లో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ ఇప్పటికే కారణమయ్యారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. 13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం నీటీ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందని ప్రశ్నించారు.


Tags:    

Similar News