TDP : నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా పహాల్గామ్ లో మరణించిన అమరులకు నివాళులర్పించునున్న పొలిట్ బ్యూరో ఇటీవల నియమించిన నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.
మహానాడు నిర్వహణ పై
దీంతో పాటు మహానాడు నిర్వహణ పై కూడా ప్రధానంగా చర్చించే అవకాశముంది. మహానాడులో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఆమోదించాల్సిన అంశాలపై పొలిట్ బ్యూరో లో చర్చించి చంద్రబాబు డిసైడ్ చేయనున్నారు. మహానాడు ఏర్పాట్లతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా నేడు పొలిట్ బ్యూరో లో చర్చించే ఛాన్స్ ఉంది. ఏడాది పాలనపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.