నేటి నుంచి "నిజం గెలవాలి"

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది

Update: 2023-10-25 02:58 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. "నిజం గెలవాలి" పేరిట భువనేశ్వరి ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. నిన్న నారావారిపల్లె కు చేరుకున్న భువనేశ్వరి అక్కడి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన భర్త లేకుండా తొలి సారి ఈ గ్రామానికి రావడం తనను బాధించిందని భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఈ బస్సు యాత్రలో ముఖ్య భాగం. పలు బహిరంగ సభల్లోనూ ఆమె ప్రసంగించనున్నారు.

వారానికి మూడు రోజులు...
వారానికి మూడు రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. ఈరోజు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రగిరి సమీపంలో జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. ఇప్పటికే బస్సు యాత్రకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని, బహిరంగ సభలకు సంబంధించిన పర్మిషన్లను కూడా తీసుకున్నామని టీడీపీ నేతలు తెలిపారు. నారావారిపల్లెలో ప్రారంభమయిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కడి నుంచి పాకాల మండలం నేండ్రగుంటకు వెళ్లి కనుమూరి చిన్న స్వామినాయుడి కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నారావారిపల్లె చేరుకుంటారు. సాయంత్రం అగరాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పెద్దయెత్తున మహిళలు ఈ సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News