ఎమ్మెల్యేలకు ఎర కేసులో కొత్త ట్విస్ట్ : రఘురామకృష్ణ రాజుకు నోటీసులు

ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే.

Update: 2022-11-24 10:21 GMT

raghurama krishna raju

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఏపీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణలో సిట్ రఘురామ కు సంబంధించిన కీలక విషయాలను సేకరించినట్టు సమాచారం.

ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా.. బీజేపీ నేత బీఎస్ సంతోష్, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్, నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ కుమార్ లకు నోటీసులు జారీ చేసింది. తాజాగా రఘురామకు నోటీసులివ్వడంతో ఏపీ రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎమ్మెల్యేల ఎరకు, రఘురామకు సంబంధం ఏంటని చర్చించుకుంటున్నారు.


Tags:    

Similar News