Telangana : నేడు కర్నూలు జిల్లాకు మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-06-07 02:33 GMT

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలోని గుమ్మితం తండాలో ఉన్న గ్రీన్ కో గ్రూప్ ఇంటిగ్రేటెడ్ రిన్యువబుల్ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్లొకేషన్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టు కావడంతో దానిని అధికారులతో మల్లు భట్టి విక్రమార్క పరిశీలించనున్నారు.

గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పరిశీలన...
తెలంగాణలోనూ ఈ తరహా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2030 నాటికి ఇరవై వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకోవడంతో ఈ ప్రాజెక్టును పరిశీలించి అధ్యయనం చేసి దీనికి సంబంధించిన నివేదికను మంత్రివర్గం సమావేశంలో ఉంచే అవకాశాలున్నాయి. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ను గురించి కూడా అడిగి తెలుసుకోనున్నారు.


Tags:    

Similar News