ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించండి : ఏపీటీఎఫ్

సెప్టంబరు 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి.

Update: 2022-09-03 12:20 GMT

సెప్టంబరు 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీటీఎఫ్ పిలుపు నిచ్చింది. ఆరోజు ప్రభుత్వం చేసే సన్మానాలను తిరస్కరించాలని ఉపాధ్యాయులను ఆ సంఘం కోరింది. ప్రభుత్వం పదే పదే ఉపాధ్యాయులను అవమానించడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఏపీటీఎఫ్ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.

అక్రమ కేసులకు....
ఉపాధ్యాయులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే అక్రమ కేసులు ఉపాధ్యాయులపై బనాయిస్తున్నారన్నారు. రెండు లక్షల రూపాయల పూచికత్తుతో బైండోవర్ కేసులు నమోదు చేశారన్నారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వారు తెలిపారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెట్టిందని, సొంత ఫోన్లలో హాజరు వేసే విధంగా వత్తిడి తెస్తున్నందుకు వ్యతిరేకంగా సెప్టంబరు 5న జరిగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నామని ఏపీటీఎఫ్ తెలిపింది. సీపీఎస్ హామీని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొంది.


Tags:    

Similar News