Breaking : టీడీపీకి భారీ షాక్... పార్టీకి కీలక నేత రాజీనామా
టీడీపీకి గుంటూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పదవికి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు.
tdp, candidate, mlc of local bodies, visakha district
తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఆయన కొంత కాలం నుంచి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. రాయపాటి రంగారావు సత్తెనపల్లి అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే అక్కడ కన్నా లక్ష్మీనారాయణను నియమించారు.
టీడీపీలో ఇమడలేక...
నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలియడంతో రాయపాటి రంగారావు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాయపాటి సాంబశివరావు కొంతకాలం క్రితం చంద్రబాబును కలసి తమకు రెండు టిక్కెట్లు కావాలని కోరారు. ఒక్కస్థానం కూడా ఇవ్వకపోవడంతో ఆయన కుటుంబం పార్టీకి గుడ్ బై చెప్పింది.