ఫలితాలు వాయిదా ఎందుకు వేశారో చెప్పాలి?

పదో తరగతి పరీక్ష ఫలితాల వాయిదాపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు

Update: 2022-06-04 08:24 GMT

పదో తరగతి పరీక్ష ఫలితాల వాయిదాపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రి పదో తరగతి పరీక్ష ఫలితాలను వాయిదా వేయడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. చివరి నిమిషంలో ఫలితాల విడుదలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి, మంత్రి విద్యార్థులకు సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు నిలదీశారు.

మద్యం వ్యాపారికి....
చేతకాని పాలనతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తికి విద్యాశాఖను అప్పగించారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్న మద్యం షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా? అని అచ్చెన్న నిలదీశారు. జగన్ రెడ్డి పాలనలో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దిగజారాయని ఆయన మండిపడ్డారు. నాడు నేడు పేరుతో కమీషన్ల పేరుతో నిధులను దండుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.


Tags:    

Similar News