లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే?

నారా లోకేష్ పాదయాత్రలో యువగళం వినిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు

Update: 2022-12-28 06:04 GMT

నారా లోకేష్ పాదయాత్రలో యువగళం వినిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. లోకేష్ పాదయాత్ర లోగోను టీడీపీ సీనియర్ నేతలు కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. 400 రోజులు నాలుగు వేల కిలోమీటర్లు వంద నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్రకు యువగళం అని పేరుపెట్టామన్నారు. యువత, మహిళలు, రైతుసమస్యలను తెలుసుకునే విధంగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా వచ్చి తమ సమస్యలను చెప్పుకునేందుకు పాదయాత్రలో అవకాశముంటుందని తెలిపారు.

వంద నియోజకవర్గాల్లో....
జనవరి 27 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి మొదలవుతుందని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించే అవకాశముందని అచ్చెన్నాయుడు అన్నారు. అన్ని అనుమతులు తీసుకుంటామని, పోలీసులు కూడా పాదయాత్రకు సహకరించాలని, భద్రత కల్పించాలని అచ్చెన్నాయుడు కోరారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించి, భవిష్యత్ గురించి చాటి చెప్పేందుకే లోకేష్ సాహసోపేతమైన యాత్రను చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలు తిరగబడే అవకాశముందని ఆయన హెచ్చరించారు.


Tags:    

Similar News