వందచోట్ల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ప్రపంచ వ్యాప్తంగా వంద చోట్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

Update: 2023-04-15 04:42 GMT

ప్రపంచ వ్యాప్తంగా వంద చోట్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రపంచ తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. జాతి నిర్మాణం వైపు తెలుగు ప్రజలను జాగృతం చేసిన మహోన్నత వ్యక్తీ ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని అచ్చెన్నాయుడు ప్రశంసించారు. ఎన్టీఆర్ నేటి తరానికి ఒక స్ఫూర్తి అని, భావితరాలకు ప్రేరణగా నిలుస్తారని, అటువంటి మహోన్నత వ్యక్తి శత జయంతి ఉత్సవాలను ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా మే 28 వరకు వంద ప్రాంతాల్లో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందన్నారు.

విదేశాల్లో 47 చోట్ల...
అందులో భాగంగా తెలంగాణ లో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో , ఆంధ్రప్రదేశ్‌లోని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ, దేశ వ్యాప్తంగా పది చోట్ల, అంతర్జాతీయ స్థాయిలో నలభై ఏడు చోట్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ప్రతి తెలుగు అభిమాని పాల్గొని ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటాలని సూచించారు.


Tags:    

Similar News