కమీషన్ల కోసమేనా? ప్రభుత్వం పట్టించుకోదా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2022-08-03 03:33 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో వరుస ప్రమాదాల పట్ల ఆయన ఆందోళన చెందారు. ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అనకాపల్లి బాండ్రిక్స్ ఫ్యాక్టరీలో కేవలం రెండు నెలల్లోనే రెండు సార్లు రసాయానాలు లీక్ కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఆ ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ప్రజలంటే లెక్కలేనితనం కనిపిస్తుందని, అందుకే రెండు సార్లు రెండు నెలల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు.

సరైన వైద్యం...
విష రసాయనాలు లీకులతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారన్నారు. విశాఖపట్పంలో జే గ్యాంగ్ కబ్జాలు ఎక్కువయ్యాయన్నారు. వాటితో పాటు గ్యాస్ లీకులు తోడయ్యాయని, అస్వస్థతకు గురైన మహిళలకు వెంటనే సరైన వైద్యం అందించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం ప్రభుత్వం కక్కుర్తి పడి చూసీ చూడనట్లు వదిలేయడం వల్లనే ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News