ఎంపీ బైరెడ్డి శబరికి అధిష్టానం నుంచి పిలుపు
తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది
తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. నిన్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు చెప్పకుండా మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలసి ఆమె పర్యటించడాన్ని నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి తెలియకుండా ఏరాసుతో కలసి పర్యటించటాన్ని అభ్యంతరం తెలిపిన ఎమ్మెల్యే అనుచరులు ఆమె పర్యటనను అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేకు తెలియకుండా...
అంతేకాదు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై ఆగ్రహంతో దాడికి దిగారు. ఈ విషయాలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం బైరెడ్డి శబరి అలా ఎమ్మెల్యే లేకుండా నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అమరావతికి పిలిచిందని తెలిసింది. సుపరిపాలనలో తొలి అడుగులో అందరినీ కలుపుకుని పోవాల్సిన ఎంపీ ఇలా చేయడంపై ఆమ నుంచి వివరణ తీసుకనే అవకాశముంది.