కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది : మాజీ మంత్రి ప్రత్తిపాటి

ఏపీ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, మల్లాది విష్ణు, జోగి రమేశ్ లు

Update: 2022-04-29 12:34 GMT

అమరావతి : ఏపీలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయని, అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఏపీలో ఉండటం అంటే నరకంలో ఉన్నట్లేనని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగ రేపుతున్నాయి. ఏపీ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, మల్లాది విష్ణు, జోగి రమేశ్ లు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వారంతా తప్పుపట్టగా.. టిడిపి నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించే కేటీఆర్ చెప్పారన్న ఆయన.. కేవలం తెలంగాణనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ గొప్పను చాటుకునేందుకు ఏపీతో పోల్చుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, ఏపీ విధ్వంసం ఇవి రెండూ కేసీఆర్, జగన్ ల ఆధ్వర్యంలోనే జరిగాయని ప్రత్తిపాటి ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధి, ఏపీ విధ్వంసం ఇవి రెండూ కేసీఆర్, జగన్ ల ఆధ్వర్యంలోనే జరిగాయని ప్రత్తిపాటి ఆరోపించారు. ఏపీలో భూముల ధరలు 200 శాతం పడిపోగా.. అదే సమయంలో తెలంగాణలో భూముల రేట్లు గణనీయంగా పెరిగాయని గుర్తుచేశారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, పరిశ్రమలు మూతపడ్డాయని, ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని.. అందుకే అందరూ తెలంగాణ సురక్షితమని అనుకుంటున్నారని ప్రత్తిపాటి అన్నారు. ప్రజలు ఇకనైనా మేల్కొని అభివృద్ధి ఎవరు చేస్తారో.. విధ్వంసం ఎవరు సృష్టిస్తారో తెలుసుకోవాలని హితవు పలికారు.


Tags:    

Similar News