Chandrababu : జగన్ లెక్కలన్నీ తారుమారు అవుతున్నాయ్

జగన్ లెక్కలు తారుమారయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు స్పందించారు.

Update: 2023-12-14 11:44 GMT

appolitics

జగన్ లెక్కలు తారుమారయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.150 సీట్లు మార్చినా వైసీపీ గెలవలేదననారు. తమ పార్టీ అభ్యర్థులకు ప్రజామోదం ఉందని చెప్పారు. దళితులను బీసీలనే ఎక్కువగా ఇతర నియోజకవర్గాలకు పంపించారననారు. అందుకే మంత్రులను కూడా నియోజకవర్గాలను మారుస్తుందన్నారు. ఒకచోట చెల్లని కాసు మరొక చోట చెల్లుతుందా అని ప్రశ్నించారు. అక్కడ టిక్కెట్లు దొరక్క వచ్చేవాళ్లు మాకు అవసరం లేదన్నారు. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి లాంటి వాళ్లను ఎందుకు మార్చలేదని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులను ప్రజాభిప్రాయాన్ని అనుసరించే చేస్తామని తెలిపారు.

తుఫాను హెచ్చరికలున్నా...
తుఫాను హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కాలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తుఫాను నష్టం తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. చేతగాని సీఎం, అసమర్థ సీఎం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్న చంద్రబాబు ఇంతవరకు పంట నష్టం అంచనా వేయలేదని, పరిహారం ఎంత ఇస్తారో ప్రకటించలేదన్నారు. విపత్తు వచ్చినప్పుడు ప్రజలకు భరోసా కల్పించాలని, ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారని తెలిపారు. తుఫాన్ వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చాయని, ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు.


Tags:    

Similar News