భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్
భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పాల్గొన్నారు
tdp chief chandrababu naidu and jana sena chief pawan kalyan
భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పాల్గొన్నారు. మందడంలో ఇద్దరూ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా భోగి సంకల్పం చేశారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపడమే లక్ష్యంగా పనిచేయాలని అందరికీ వారు పిలుపు నిచ్చారు. వచ్చే ఏడాది టీడీపీ, జనసేన ప్రభుత్వం కలసి అమరావతిలో సంక్రాంతి వేడుకలు జరుపుకుందామని చంద్రబాబు అన్నారు.
రాజధానిగా...
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించామన్నారు. జై అమరావతి నినాదంతో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు వివరించాలని అన్నారు. ఉపాధి అవకాశాలు లేకుండా పోవడంతో ఐదేళ్ల నుంచి యువత ఇబ్బంది పడుతుందన్నారు. మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ అంధకారం అవుతుందని పవన్ అన్నారు. జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ కలసికట్టుగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు.