కేంద్రమంత్రికి చంద్రబాబు ఘాటు లేఖ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు

Update: 2022-06-29 12:26 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా ప్రాజెక్టు పెద్ద నష్టం జరిగిందని వివరించారు. ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని పోలవరం పూర్తయ్యేలా చూడాలని ఆయన మంత్రికి రాసిన లేఖలో కోరారు. 2014లో ఏర్పడిన ప్రభుత్వం 71 శాతం పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసిందన్నారు. జాతీయ హోదా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సహకరించిందన్నారు.

అసమర్థ నిర్ణయాల వల్లే...
అయితే ప్రస్తుత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రమాదంలో పడిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పనులు చూసి చాలా బాధగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్వార్థప్రయోజనాలు, తప్పుడు ప్రాధాన్యతలతో ముందుకు వెళుతుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులను మరొక సంస్థకు అప్పగించిందన్నారు.
కాంట్రాక్టరును మార్చినందున...
ఇందుకు ఆరు నెలల సమయం పట్టిందన్నారు. కాంట్రాక్టరును మార్చే సమయంలో ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టలేదన్నారు. ఫలితంగా డయాఫ్రమ్ వాలం్ దెబ్బతినిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్టరును మార్చాల్సిన అవసరం లేదని పోలవరం అథారిటీ చెప్పినా ఈ ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు. నిర్మాణం ఆలస్యం కారణంగా ప్రాజెక్టు ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని లేఖలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యంతో పునరావస ఖర్చులు కూడా పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వీలయినంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గజేంద్ర షెకావత్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.




Tags:    

Similar News