Breaking : సునీత పిటీషన్‌పై సుప్రీం ఆదేశాలివే

వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది

Update: 2023-04-21 07:30 GMT

వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొద్దిసేపటి క్రితం వివేకానందరెడ్డి కుమార్తె సునీత పిటీషన్ ను విచారించిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. అయితే సోమవారం వరకూ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంత అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్లయింది.

మధ్యంతర ఆదేశాలను....
వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి కోరడంతో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ విచారణకు మాత్రం మూడు రోజుల నుంచి హాజరవుతున్నారు. వివేకా హత్యకేసులో కీలకంగా ఉన్న అవినాష్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని తెలిపింది. దీనిపై సునీత సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా దానిపై విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై స్టే విధించింది. సోమవారం కోర్టులో తిరిగి విచారణ ప్రారంభమవుతుంది.


Tags:    

Similar News