జగన్ సర్కార్ కు "సుప్రీం" నోటీసులు

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Update: 2022-08-11 08:28 GMT

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్ధం చేసిన డిజైన్లను తీసుకోనందుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీకి నోటీసులు జారీ చేసింది. అమరావతిలో నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీకి డిజైన్ల కోసం కాంట్రాక్టు ఇచ్చింది.

డిజైన్ల డబ్బులు...
అయితే కొత్త రాజధాని అమరావతి డిజైన్లను ఆ కంపెనీ సిద్ధం చేసింది. కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ డిజైన్లను పక్కన పెట్టింది. తమకు ఇవ్వాల్సిన బకాయీల కోసం ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ జగన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులను పట్టించుకోక పోవడంతో ఆ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ధర్మాసనం పిటీషన్ ను విచారించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


Tags:    

Similar News