మాజీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సంజయ్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే న్యాయస్థానం ఎదుట ముందు లొంగిపోవడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. మాజీ సీఐడీ అధికారి సంజయ్ కస్టడీ కోసం మెజిస్ట్రేట్ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.
ముందస్తు బెయిల్ రద్దు...
అగ్నిమాపక శాఖలో జరిగిన అవినీతికేసులో ఆయనపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. మూడు వారాల్లోగా లొంగిపోవాలని, సంజయ్ ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.