సార్జెంట్ రామసుబ్బారెడ్డిని ఆదుకోండి
భారత వైమానిక దళంలో 20 ఏళ్ల పాటు సేవలందించారాయన.
భారత వైమానిక దళంలో 20 ఏళ్ల పాటు సేవలందించారాయన. ప్రస్తుతం అనారోగ్యం బారినపడి కదల్లేని స్థితిలో ఉన్నారు. ఎవరైనా సాయం చేయకపోరా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కంతేరుకు చెందిన ద్వారంపూడి రామసుబ్బారెడ్డి 1998లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. 2018లో సార్జెంట్ హోదాలో రిటైర్ అయ్యారు.
మాజీ సైనికులకు జీవనాధారంగా ప్రభుత్వమిచ్చే ఐదు ఎకరాల భూమి కోసం 2019లో దరఖాస్తు చేశారు. 2022 ఫిబ్రవరిలో ఆసుపత్రి పాలవ్వగా, వైద్యులు మోటార్ న్యూరాన్ డీసీజ్ గా తేల్చారు. దాచుకున్న డబ్బులు ఆయన వైద్యానికే ఖర్చు చేశామని, ప్రభుత్వం ఆదుకోవాలని రామసుబ్బారెడ్డి భార్య మౌనికారెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. కదల్లేని స్థితిలో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు చక్రాల కుర్చీలో ఎక్కించుకొని కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు.