మార్చి రాకుండానే.. మండుతున్న ఎండలు !

మార్చి రాకుండానే ఎండలు మండిపోతున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం

Update: 2022-02-18 06:47 GMT

మార్చి రాకుండానే ఎండలు మండిపోతున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం తగ్గిపోయి.. ఎండల తీవ్రత మొదలైంనట్లు హైదరాబాద్ వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో శీతాకాలం ముగిసిపోతోందని, మెర్క్యురీ స్థాయి చాలా ప్రాంతాల్లో పెరుగుతుందని పేర్కొంది. ఆంధ్రాలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఉదయం పూట 7-8 గంటల వరకూ కాస్త చల్లగానే ఉన్నా.. ఆ తర్వాత భానుడి ప్రతాపం మొదలవుతోంది.

మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో వేసవి కాలం మొదలవుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లో 19.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠం, 32.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 15-21 డిగ్రీల మధ్య కనిష్ఠం, 31-32 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రమంగా ఈ ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏదేమైనా వేసవికాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ ఏడాది చలి తీవ్రంగా ఉంది కాబట్టి.. ఎండలు కూడా అంతే తీవ్రంగా ఉండనున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి. వీలైనంత వరకూ నీడపట్టున ఇంట్లోనే ఉండటం మంచిది. అలాగే ఈ ఏడాది వడగాలుల తీవ్రత కూడా కాస్త ఎక్కువగానే ఉండనున్నట్లు సమాచారం. మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తరచూ తీసుకోవడం ద్వారా వడగాలుల నుంచి రక్షణ పొందవచ్చు.



Tags:    

Similar News