Thu Jan 29 2026 06:59:09 GMT+0000 (Coordinated Universal Time)
బీరు సీసా పేలి ఆర్టీసీ డ్రైవర్ కు తీవ్రగాయాలు
ప్రయాణికులను తాడ్వాయికి తరలించిన అనంతరం డ్రైవర్.. బస్సును బస్టాప్ లో ఆపాడు. పక్కనే ఉన్న వైన్ షాపులో బీరు కొనుగోలు చేసి.

బీరు సీసా పేలి.. ఆర్టీసీ డ్రైవర్ కు తీవ్రగాయాలైన సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో జరిగింది. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రయాణికులను తాడ్వాయికి తరలించిన అనంతరం డ్రైవర్.. బస్సును బస్టాప్ లో ఆపాడు. పక్కనే ఉన్న వైన్ షాపులో బీరు కొనుగోలు చేసి.. బొడ్లో పెట్టుకుని వెళ్తున్నాడు.
డ్రైవర్ అలా వెళ్తున్న క్రమంలో.. బొడ్లో ఉన్న బీరు సీసా ఒక్కసారిగా పేలింది. దాంతో ఆయన ఉదర భాగంలోకి గాజుముక్కలు దూసుకుపోయి.. పేగులు బయటకు వచ్చాయి. అక్కడే ఉన్న కొంతమంది డ్రైవర్లు అతడిని వెంటే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story

