నేటి నుంచి విద్యాసంస్థలకు వేసవి సెలవులు
నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు.
dussehra holidays
నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. నేటి నుంచి వేసవి సెలవులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకూ విద్యాసంస్థలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
జూన్ 11వ తేదీ వరకూ...
తిరిగి జూన్ 12వ తేదీన విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. నేటి నుంచి రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, గురుకుల విద్యాసంస్థలన్నీ మూత పడనున్నాయి. అయితే ఉపాధ్యాయులు మాత్రం తర్వాత విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది చేరేలా చూడాలని కోరారు. సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు.